
నటీనటులు: రామ్‌చరణ్, జెనీలియా, షాదన్ పదమ్‌సీ (తొలిపరిచయం), ప్రభు, సమీర్, అవసరాల శ్రీనివాస్, ప్రకాష్ రాజ్, గాయత్రీరావు, కిషోర్, బ్రహ్మానందం, సంచిత, నాగబాబు, మధురిమ, మంజుల, సంజయ్ తదితరులు,కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్,సంగీతం: హారిస్ జైరాజ్.పాయింట్: ప్రేమికులు జీవితాంతం ప్రేమిస్తున్నారనేది అబద్ధం. కొంతకాలమనేది నిజం.లవ్‌స్టోరీలు సినిమా చరిత్ర ఆరంభం నుంచి రకరకాల కథల్లో వస్తున్నాయి. మారిన దేశకాల పరిస్థితులకు అనుగుణంగా కథలూ మారాయి. హైటెక్ కల్చర్ ప్రేమలు ఎలా ఉంటున్నాయో చాలా చిత్రాలూ చూపించాయి. అయితే "ఆరెంజ్"ను మాత్రం కొంచెం కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు బొమ్మరిల్లు భాస్కర్ ప్రయత్నించాడు. ఆర్య-2 కథ చూశాక ఇదొక తిక్క ప్రేమకథ అన్నారు. మరికొందరు పర్వాలేదన్నారు. "ఆరెంజ్" కూడా అదే కోవలోకి వస్తుంది.ఇక కథలోకి వెళితే.....