Monday, 25 April 2011

ఏమైంది ఈ వేళ రివ్యూ



Movie Name "ఏమైంది ఈ వేళ"
Banner     శ్రీ సత్యసాయి ఆర్ట్స్      
Producer  కె.కె.రాధామోహన్      
Director    సంపత్ నంది      
Music చక్రి      
Photography కె.బుజ్జి      
Story సంపత్ నంది      
Dialouge సంపత్ నంది
 Lyrics   భాస్కర భట్ల రవికుమార్,
రామజోగయ్య శాస్త్రి,కందికొండ
 Editing ముత్యాల నాని
 Art డి.వై.సత్యనారాయణ
 Star Cast వరుణ్ సందేశ్,నిషా అగర్వాల్,
శశాంక్,నిషా షా,వెన్నెల కిశోర్,
ప్రగతి,ఝాన్సీ,దువ్వాసి మోహన్,
యమ్.యస్.నారాయణ,
అశోక్ కుమార్ తదితరులు...


ఇది చాలా సింపుల్ కథ.రెండు ముక్కల్లో చెప్పాలంటే ఈ నాటి తరానికి ప్రేమ,పెళ్ళి మీద ఉన్న అవగాహన ఏమిటి...? వారి అభిరుచులేంటి...?వారి ఆలోచనా విధానం ఏమిటనేదే ఈ కథ.ఈ సినిమా ఓపెనింగ్ సీన్లో అవంతిక(నిషాఅగర్వాల్) తను యువ (శశాంక్)తో రెండో పెళ్ళి చూపుల కోసం ఒక రెస్టారెంట్లో కలుస్తుంది.


అదే పని మీద శీను (వరుణ్ సందేశ్) కూడా నిమిష (నిషా షా)ను కలుస్తాడు ఒక పార్క్ లో.అవంతిక తన మొదటి పెళ్ళి ఎలా జరిగింది అన్నది యువకు చెపుతూంటే,తన మొదటి పెళ్ళి ఎలా జరిగిందో తమ మధ్య ఎలా పరిచయం అయ్యిందో,ఆ పరిచయం ఎలా ప్రేమగా మారిందో,వారి పెళ్ళి పెద్దల అంగీకారం లేకుండా ఎలా జరిగిందో,ఆ తర్వాత తమకు విభేదాలెలా వచ్చాయో,ఎలా విడిపోయారో నిమిషకు కూలంకషంగా ఏదీ దాచకుండా చెపుతాడు శీను.


ఆఖరికి తామిద్దరూ పెళ్ళికి ముందే శారీరకంగా ఏలా కలిసిందీ కూడా కలిపి.తీరా చూస్తే అవంతిక,శీను ఇద్దరు గతంలో విడిపోయిన భార్యాభర్తలు.తను చేసుకోబోయే అమ్మాయి వేరే వాడితో శారీరకంగా కలిసిందన్న తర్వాత అవంతిక మీద యువ భావాల్లో మార్పు వస్తుంది.అదే ఫీలింగ్ నిమిషకు కూడా శీను మీద కలుగుతుంది.యువను అవంతిక,నిమిషను శీను పెళ్ళిచేసుకున్నారా...?చివరికి ఏమయ్యిందనేది మిగిలిన కథ.


దర్శకత్వం- ఇది నేటి తరాన్ని సున్నితంగా విమర్శిస్తూ జీవితం మీద వారికి ఒక అవగాహన కలిగిస్తూ,కనువిప్పు కలిగించే చక్కని సందేశాత్మక చిత్రం.ఈ చిత్ర కథతో పాటు ఆ కథకు చక్కని సంభాషణలను కూడా దర్శకుడు సంపత్ నంది వ్రాశారు.ఈ చిత్రం ముందు స్లోగా మొదలై,నేటి తరపు ఆలోచనలతో,వారికి ప్రేమ,పెళ్ళి,జీవితాల మీద ఉన్న అభిప్రాయాలతో మనకు తెలియకుండానే కథలోకి లాక్కెళుతుంది.


ఒక చక్కని కథను మరింత చక్కని స్క్రీన్ ప్లే తో అత్యంత చక్కగా తీర్చిదిద్దిన ఘనత దర్శకుడు సంపత్ నందికే దక్కుతుంది.కానీ ఇలాంటి కథను తెరకెక్కించటానికి మంచి అభిరుచి ఉన్న నిర్మాత కావాలి.అలాంటి అభిరుచి ఉన్నచక్కని నిర్మాత కె.కె.రాధామోహన్ ని ముందుగా అభినందించాలి.


నటన - వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో నటన మీద కాస్త దృష్టి పెట్టినట్లున్నాడు.అతని నటనలో కొంచెం అభివృద్ధి కనిపించింది.ఇక నూతన నటి నిషా అగర్వాల్ నటనలో చాలా పరిణితి కనిపించింది.భవిష్యత్తులో ఆమె తన అక్క కాజల్ అగర్వాల్‍ కు కచ్చితంగా పోటిగా తయారవుతుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.


ఇక వెన్నెల కిశోర్ బాగానే నవ్విస్తాడు.వరుణ్‍ సందేశ్ తల్లిగా ప్రగతి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఆమె డైలాగులు కూడా ప్రేక్షకులను అంతే ఆకట్టుకుంటాయి.మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సంగీతం- చాలా బాగుంది.పాటలన్నీ బాగున్నా "తునీగల్లే ఉన్నావులే...చిరుగాలల్లే వచ్చావులే","నీ నవ్వులే మ్యూజికల్...నీ నడకలే క్లాసికల్" పాటలు బాగా క్యాచీగా ఉన్నాయి.రీ-రికార్డింగ్ కూడా బాగుంది.


సినిమాటోగ్రఫీ - హడావుడి,హంగామాల్లేకుండా చూడటానికి ముచ్చటగా ఉంది ఈ చిత్రంలోని సినిమాటోగ్రఫీ.పాటల్లో ఇంకా బాగుంది. మాటలు - ఈ చిత్రంలోని మాటలు చాలా బాగున్నాయి.ముఖ్యంగా అమ్మాయిల పట్ల అబ్బాయిలకు,అబ్బాయిల పట్ల అమ్మాయిలకు
ఎలాంటి భావాలున్నాయో ఈ చిత్రంలోని మాటలు అద్దంపడతాయి.అలాగే పిల్లలు తమ మాట వినకుండా ప్రవర్తిస్తూంటే వాళ్లని కన్నపెద్దల మనోభావాలెలా ఉంటాయో ప్రగతి పాత్ర ద్వారా చెప్పించిన మాటలు చాలా బాగున్నాయి.


పాటలు - ఈ చిత్రంలోని పాటల్లో ఒక పాటతో మరొక పాట సాహిత్యంలో పోటిపడ్డాయని చెప్పవచ్చు.చాలా కాలం తర్వాత కాస్త అర్థవంతమైన సాహిత్యం ఈ చిత్రంలోని పాటల్లో మనకు వినపడుతుంది.
ఎడిటింగ్ - ఒక్క వేస్ట్ షాట్ కూడా లేకుండా నిట్ గా,క్రిస్ప్ గా ఉంది ఈ చిత్రంలోని ఎడిటింగ్.ఎడిటింగ్ బాగుంది.
ఆర్ట్ - ఈ చిత్రంలోని కళాదర్శకత్వం చాలా బాగుంది.

0 comments:

Post a Comment