Monday, 25 April 2011

ఆరెంజ్ రివ్యూ




నటీనటులు: రామ్‌చరణ్, జెనీలియా, షాదన్ పదమ్‌సీ (తొలిపరిచయం), ప్రభు, సమీర్, అవసరాల శ్రీనివాస్, ప్రకాష్ రాజ్, గాయత్రీరావు, కిషోర్, బ్రహ్మానందం, సంచిత, నాగబాబు, మధురిమ, మంజుల, సంజయ్ తదితరులు,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్,
సంగీతం: హారిస్ జైరాజ్.


పాయింట్: ప్రేమికులు జీవితాంతం ప్రేమిస్తున్నారనేది అబద్ధం. కొంతకాలమనేది నిజం.
లవ్‌స్టోరీలు సినిమా చరిత్ర ఆరంభం నుంచి రకరకాల కథల్లో వస్తున్నాయి. మారిన దేశకాల పరిస్థితులకు అనుగుణంగా కథలూ మారాయి. హైటెక్ కల్చర్ ప్రేమలు ఎలా ఉంటున్నాయో చాలా చిత్రాలూ చూపించాయి. అయితే "ఆరెంజ్"ను మాత్రం కొంచెం కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు బొమ్మరిల్లు భాస్కర్ ప్రయత్నించాడు. ఆర్య-2 కథ చూశాక ఇదొక తిక్క ప్రేమకథ అన్నారు. మరికొందరు పర్వాలేదన్నారు. "ఆరెంజ్" కూడా అదే కోవలోకి వస్తుంది.
ఇక కథలోకి వెళితే.. ఆస్ట్రేలియా సిడ్నీలో ఉండే రామ్ (రామ్ చరణ్).. (టైటిల్స్‌లో మెగా పవర్‌స్టార్ అని వేశారు. ఇక నుంచి అలా పిలవాలనేమో) గోడలపై రకరకాల బొమ్మలు వేస్తుంటాడు. ఇది అతని హ్యాబీ. అసలు పని ఫోటోగ్రఫీ పేరుతో వయొలెంట్ ఫోటోగ్రఫీ నేర్చుకోవడం అంటే జియోగ్రఫీ ఛానల్‌లో మాదిరి వాటిని ఫోటోలు తీయడం, స్కైడైవింగ్ చేయడం చేస్తుంటాడు. రామ్ జీవితంలో భార్యాభర్తలైన కృష్ణ కుమార్తె మంజుల, సంజయ్‌‌లు అక్క బావలు. ఇంకా తన చుట్టూ ఇద్దరు స్నేహితులు.
ఇక రామ్‌ అందరూ ప్రేమలో పడటాన్ని చూసి మీది నిజమైన ప్రేమ కాదని వాదిస్తాడు. ప్రేమంటే నిజం చెప్పడం. అబద్ధంతో ప్రేమించినా అది జీవితాంతం ఉండదనే పాలసీ చెబుతాడు. ఎంతకాలం నిలబడితే అదే చాలు అంటాడు. అలా తొమ్మిది మంది రామ్‌ను ప్రేమించి విసిగి వదిలేస్తారు.
పదవ అమ్మాయిగా జాను (జెనీలియా) కెమెస్ట్రీ మూడో సంవత్సరం చదివేందుకు కో ఎడ్యుకేట్ కాలేజీలో చేరుతుంది. అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ప్రేమించుకోవడం జానుకు చాలా థ్రిల్ కలిగిస్తుంది. తను అలా ఎవరినైనా ప్రేమించాలనుకుని ముగ్గురిని ప్రపోజ్ చేస్తుంది.
కానీ మొదటిచూపులో జానును ప్రేమించిన రామ్ తను ప్రేమిస్తున్నానని చెబుతాడు. అయితే కొద్దికాలమేనని మతలబు పెడతాడు. అలా ఎందుకన్నానో కొన్ని ఉదాహరణలు చూపిస్తాడు. ఆఖరికి ప్రేమించి పెండ్లిచేసుకున్న మీ తల్లిందండ్రులు కూడా ప్రస్తుతానికి ప్రేమించుకోవడం లేదని నిరూపిస్తాడు. తను ప్రేమించలేదని తెలిసినా జానును రామ్ ప్రేమిస్తున్నానని రకరకాల ప్రయత్నాలతో తనవైపు తిప్పుకుంటాడు. తీరా జాను ప్రేమించానన్నాక నేను జీవితంలో ప్రేమించలేదంటాడు.
ఇలా రామ్‌ను పిచ్చోడని డిసైడ్ అవుతారు. కానీ తను చెప్పినదాంట్లో న్యాయముందని జాను తండ్రి ఫైనల్‌గా అంచనాకు వస్తాడు. ఎవరైనా ప్రేమించిన కొత్తలో బాగానే ప్రేమించుకుంటారు. ఆ తర్వాత పిల్లలను ప్రేమిస్తారు. కానీ నిజమైన ప్రేమ తర్వాత ఉండదు. ప్రేమిస్తున్నట్లు ఒకరికొకరు అబద్ధాలు ఆడుకుంటారు.? దానికి ఏం చేయాలి? అనేది ముగింపు.
రామ్‌ పాత్రలో రామ్‌చరణ్ బాగానే చేశాడు. రామ్ చరణ్ నటన "ఆరెంజ్"కు హైలైట్. కానీ శృతిమించింది. అప్పడో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా కాలేజీలో సరదాలు థ్రిల్‌గా ఎంజాయ్ చేసే సన్నివేశాలు పండించింది. ప్రకాష్‌రాజ్, రఘు, మంజుల ఇతర పాత్రలు పర్వాలేదు.
వెన్నెల కిషోర్ నుంచి పెద్ద కామెడీ లభించలేదు. టెక్నికల్‌గా ఉపయోగించుకునేందుకు సన్నివేశాలు లేవు. హరీష్ జైరాజ్ సంగీతం పర్వాలేదు. సిడ్నీ నగరం, రమ్మంటే వచ్చేది ప్రేమకాదు.. వంటి పాటలు బాగున్నాయి. సముద్రమంత ప్రేమను పొందడం చాలా కష్టం. ప్రేమ అనేది ఇరువైపులా ఉండాలనే సూక్తులు చెప్పే పాత్రలు నాగబాబు కన్పిస్తాడు.
మొదటి భాగం చూసినంతసేపు ఇదోపిచ్చి కథ అనిపిస్తుంది. సన్నివేశాలు కూడా అలానే ఉంటాయి. సెకండాఫ్‌లో తను ఎందుకు అలా ప్రవరిస్తున్నానని రామ్ చెబుతుంటాడు. ఏది ఎలాగైనా భారతదేశ సంప్రదాయం ప్రకారం ఒకరికొకరు సర్దుకుపోవాలి అనేది చివరిగా దర్శకుడు చెప్పేనీతి. భూమి గుండ్రంగా ఉందని తెలుసు.
కానీ మధ్యలో కొండలు, సముద్రాలు.. ఇలా దాటుకుంటూపోతే వంకరటింకరగానూ ఉంటుంది. ఈ చిత్రకథను కూడా అలానే చెప్పి వైవిధ్యంగా తీశాడు. ఆర్య-2 వంటి చిత్రాల్ని రుచిచూసిన యూత్‌కు ఈ చిత్రం నచ్చవచ్చు. కానీ ఇందుకోసం రెండున్నర గంటలకు పైగా ఓపిగ్గా కూర్చుంటారా అనేది ప్రశ్న. సాంప్రదాయులకు "ఆరెంజ్" ఏ మాత్రం నచ్చదు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి థియేటర్లలో విడుదలైందని చెపుతున్న ఈ చిత్రానికి వారం తర్వాత ఎన్ని థియేటర్లు మిగులుతాయో వేచి చూడాలి.

సంగీతం - ఈ చిత్రం ఆడియో ఇప్పటికే పెద్ద హిట్టయ్యింది.ఇప్పుడు దాని గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు.రీ-రికార్డింగ్ బాగుంది.
సినిమాటోగ్రఫీ - చాలా బాగుంది.పాటల్లో ఇంకా బాగుంది.ఆస్ట్రేలియా అందాలు ఈఅ చిత్రంలో బాగానే చూపించారు.
మాటలు - బాగున్నాయి.కానీ కాన్సెప్ట్ లోపం వల్ల మాటలు బాగున్నా వాటి ప్రభావం సినిమాపై అంతగా కనిపించదు.
పాటలు - ముందే చెప్పినట్టు ఇప్పటికే హిట్టయ్యాయి కదా.సాహిత్యమ నచ్చకపోతే అవి ఎలా హిట్టవుతాయి.
ఎడిటింగ్ - బాగుంది.
ఆర్ట్ - బాగుంది.
కొరియోగ్రఫీ - ఈ చిత్రంలోని అన్ని పాటల్లో కొరియోగ్రఫీ గొప్పగా లేకున్నా చూడ తగినట్టుగానే ఉంది.

0 comments:

Post a Comment